26-04-2025 08:08:39 PM
జెండా ఊపి ప్రారంభించిన మాజీ మంత్రి హరీశ్ రావు..
పటాన్ చెరు: వరంగల్ లో ఆదివారం జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ రంగు కార్లు శనివారం సాయంత్రం భారీగా తరలాయి. బీఆర్ఎస్ యువ నేత సాయి చరణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గులాబీ రంగు కార్లను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Siddipet MLA Harish Rao) తన నివాసం నుంచి జెండా ఊపి ప్రారంభించారు. వరంగల్ సభ కోసం అంబాసిడర్ కార్లకు గులాబీ రంగు వేయించి సాయి చరణ్ గౌడ్ ను హరీశ్ రావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయ కర్త ఆదర్శ్ రెడ్డి, పటాన్ చెరు కార్పొరేటర్ కుమార్ యాదవ్, జిన్నారం మాజీ జడ్పీటీసీ కొలను బాల్ రెడ్డి, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, తెల్లాపూర్ మాజీ వైస్ చైర్మన్ రాములుగౌడ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య యాదవ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.