న్యూఢిల్లీ, నవంబర్ 15: సైన్యంలోకి ప్రవేశ పెట్టే ముందు పినాకా రాకెట్ లాంచర్‌ను రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్‌డీఓ) విజ యవంతంగా పరీక్షించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వెపెన్ సిస్టమ్‌కు అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో అడ్వాన్స్ గైడెడ్ వెపన్ సిస్టమ్‌ను డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. గురువారం జరిపిన ప్రయోగంలో రాకెట్లు చేరగలిగే దూరం, కచ్చితత్వం వంటి వేర్వేరు అంశాలను పరీక్షించారు.
వేరు వేరు ప్రదేశాల నుంచి మూడు దశల్లో ఈ పరీక్షలను నిర్వహించినట్లు రక్షణశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. రెండు పినాకా లాంచర్ల ద్వారా 12 రాకెట్లను ఫైరింగ్ చేసినట్టు తెలిపింది. పినాకా ప్రయోగం విజయవంతం కావడంపట్ల రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.