calender_icon.png 17 October, 2024 | 9:49 AM

పైలట్ X కో పైలట్

17-10-2024 01:04:02 AM

శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు తప్పిన ప్రమాదం

సిడ్నీ, అక్టోబర్ 16: శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కో పైలట్ చేసిన అనాలోచిత చర్య, ఆపై పైలట్ వ్యహరించిన తీరు వివాదాస్పదంగా మారి పైలట్ ఉద్యోగం కోల్పోయేలా చేసింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు విమానం బయలుదేరింది. ఈ క్రమంలో విమానంలో పైలట్, అతనికి సహాయంగా మహిళా కో పైలట్  కాక్‌పిట్‌లో ఉన్నారు.

ఈ క్రమంలో విమానం ఆకాశంలో ఉండగా మహిళా కో పైలట్ అత్యవ సరంగా వాష్ రూమ్‌కు వెళ్లారు. అయితే ఆ టైంలో తనకు ప్రత్యామ్నాయంగా మరో కో పైలట్‌ను పైలట్‌కు సహాయంగా ఆమె ఏర్పాటు చేయలేదు. దీంతో పైలట్, కో పైలట్ మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఈక్రమంలో మహిళా కో పైలట్‌పై పైలట్  కోపంతో విపరీత చర్యలకు పాల్పడ్డాడు.

మహిళా కో పైలట్‌ను కాక్‌పిట్ నుం చి బయటకు పంపి లోపలి నుంచి లాక్ వేసుకున్నాడు. అయితే వారిద్దరి మధ్య జరిగిన ఈ వివాదంతో ప్రయాణికులు భయపడ్డారు. విమానం కొలంబో చేరుకున్న తరువాత ఈ ఘటనపై మహిళో కో పైలట్ శ్రీలంక ఎయిర్ లైన్స్ అధికారులకు కంప్లుం ట్ చేసింది.

దీంతో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఎయిర్‌లైన్స్ ఉన్నతాధికా రులు పైలట్‌ను డ్యూటీ నుంచి తాత్కాలికంగా విచారణ పూర్తయేదాకా తొలగించా రు. పైలట్ వ్యవహారంపై ఆ దేశ సివిల్ ఏవియేషన్ అథారిటీ విచారణ జరుపుతోంది. విచారణ అనంతరం పైలట్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపింది.

కాగా ప్రతి విమా నంలోని కాక్‌పిట్‌లో పైలట్, కో పైలట్ ఉం టారు. ఆకాశంలో విమానం ప్రయాణిస్తున్నప్పుడు అత్యవసర పనులపై కో పైలట్ బయటకు వెళితే పైలట్‌కు సహకారం అందించడానికి మరొకరి( కో పైలట్)ని ఏర్పాటు చేస్తారు.