* కౌంటర్ వేయాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జనవరి 29, (విజయక్రాంతి): రహస్య కెమెరాల దుర్వి నియోగం అవుతున్నాయంటూ దాఖలైన పిల్‌లో కౌంట ర్ పిటిషన్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 28 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 5కి వాయిదా వేసింది.
సీక్రెట్ కెమెరాల విక్రయాల దశలోనే అడ్డుకోవాలంటూ హెవెన్ హోమ్స్ సొసైటీ వ్యవస్థాపకురాలు వరలక్ష్మి వేసిన పిల్‌ను బుధవారం యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుక యరాతో కూడిన డివిజన్ బెంచ్ మరోసారి విచారించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ వేసిందని, కేంద్రం మళ్లీ గడువు కోరడం సరికాదని అభిప్రాయపడింది.
ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసిం ది. రహస్య కెమెరాల వ్యవహారంపై విధివిధానాలు లేకపోవడంతో దుర్వినియోగం అవుతోందని పిటిష నర్ న్యాయవాది వాదించారు. సిక్రెట్ కెమెరాలను మార్కెట్లోనే కాకుండా ఆన్‌లైన్ లో నేరుగా విక్రయిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
కొందరు ఆ రహస్య కెమెరాలను వాష్‌రూంలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఎక్స్ రే గదుల్లో ఉంచుతూ దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. రహస్య కెమెరాల క్రయవిక్రయాలపై ఎలాంటి విధి విధానాలు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే విచారణ జరిపి రహస్య కెమెరాల క్రయ విక్రయాలపై నియంత్రణ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.