calender_icon.png 11 January, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రానైట్ కాలుష్యంపై పిల్

04-08-2024 02:20:54 AM

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాం తి): కరీంనగర్ జిల్లా బావుపేట, కొత్తపల్లి మండలం అసిఫ్‌నగర్‌లో గ్రానైట్ క్వారీల తో పరిసరాల కాలుష్యంపై డాక్టర్ అరుణ్‌కుమార్ హైకోర్టుకు లేఖ రాశారు. గ్రానైట్ క్వారీలు, దీని అనుబంధ పరిశ్రమలైన కటింగ్, పాలిషింగ్ తదితరాల వల్ల కొండలు ధ్వంసమయ్యాయని లేఖలో పేర్కొన్నారు. గతంలో పచ్చగా కళకళలాడే ఈ కొండల వల్ల పశువులు, గొర్రెల పెంపకం ద్వారా చాలామంది జీవనోపాధి పొందేవారన్నారు. ప్రస్తుతం క్వారీ గుంతలు, కాలుష్యంతో పచ్చదనం హరించుకుపోయిందని తెలిపారు. 10 గ్రామాల్లోని 40 వేల మంది ప్రజలు కాలుష్యంతో అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. వ్యర్థాలను చెరువుల్లో వదులుతుండటంతో వ్యాధులు వస్తున్నాయన్నారు. హైకోర్టుకు అందిన ఈ లేఖ ను పిల్‌గా తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ, పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శులు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, కరీంనగర్ కలెక్టర్, గనుల శాఖ సహాయ డైరెక్టర్, పర్యావరణ ఇంజినీరు, కొత్తపల్లి తహసీల్దార్లను ప్రతివాదులుగా చేర్చింది.