వికారాబాద్ జనవరి 16: తాండూరు పట్టణం నుంచి శ్రీశైలం మహా క్షేత్రానికి శివ భక్తుల పాదయాత్ర గురువారం ప్రారంభమైంది. గత కొన్నిల్లుగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా భక్తులు కొనసాగించారు. శ్రీ ఉమా మహేశ్వర సేవాసమితి ఆధ్వర్యంలో తాండూరు నుంచి శ్రీశైలం మహాపాదయాత్ర గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సేవాసమితి సభ్యులు విద్యాసాగర్ గౌడ్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డిల ఆధ్వర్యంలో సుమారు 80 మంది భక్తులు పాదయాత్రగా బయలుదేరారు.