12-02-2025 02:06:01 AM
విచారణ మార్చి 18కి వాయిదా: హైకోర్టు
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): గౌలీగూడలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) నుంచి శంషాబాద్ వరకు చేపట్టనున్న మెట్రో విస్తరణ పనులతో ఎన్నో చారిత్రక కట్టడాలకు ప్రమాదం ఉందని దాఖలైన పిల్‌పై విచారణను హైకోర్టు మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది.
నాలుగో కారిడార్ నిర్మాణంలో భాగం గా మెట్రో రెండో దశ విస్తరణ పనులను ఆపాలంటూ యాక్ట్ పబ్లిక్ వెల్ఫే ర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మహమ్మద్ రహీం ఖాన్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిల్‌లో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్, భూసేకరణ అధికారి, మెట్రో ఎండీ, వక్ఫ్ బోర్డు సీఈవోను చేర్చారు.
పిల్‌పై మంగళవారం యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ రేణుక యారాతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారిం చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాయిదా కోరడంతో బెంచ్ విచారణను మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది.