calender_icon.png 16 January, 2025 | 2:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సివిల్ సప్లయీస్ కార్పొరేషన్లో అక్రమాలపై పిల్

06-09-2024 12:47:53 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): తెలంగాణ సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీ సీఎస్సీఎల్) లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని వివరిస్తూ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఆ సంస్థ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్రెడ్డి వేసిన పిల్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేయనుంది. రాష్ట్ర ఖజానాకు రూ.1100 కోట్ల మేర నష్టం కలిగించేలా అక్రమాలు జరుగుతున్నాయనే పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే బెంచ్ విచారిస్తుంది. తక్కువ ధరకు వడ్లను బిడ్డర్లకు విక్రయించడం, తిరిగి అత్యధిక ధరకు వారి వద్దే  బియ్యం కొనుగోలు చేయడం ద్వారా పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతోందని పిల్‌లో పేర్కొన్నారు. పౌరసరఫరాలశాఖ ముఖ్యకార్యదర్శి, పౌరసరఫరాల కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీ, కమిషనర్ ఇతరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.