26-04-2025 01:12:58 AM
సవరణ చట్టంలోని పలు సెక్షన్లపై అభ్యంతరం
సుప్రీంలో విచారణ తర్వాత చూద్దామన్న కోర్టు
హైదరాబాద్, ఏప్రిల్ 25: కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయొద్దని తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై శుక్రవారం ఉన్నత న్యాయస్థా నం విచారణ చేపట్టింది. ఆక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఈ పిల్‌ను వేసింది. సవరణ చట్టంలోని పలు సెక్షన్లను పిటిషన్‌లో సవా లు చేసింది.
కాగా, వక్ఫ్ సవరణ చట్టంపై అత్యున్నత న్యాయస్థానంలోనూ విచారణ జరుగుతున్న నేపథ్యంలో, అక్కడ తేలిన తర్వాత ఈ పిల్‌ను పరిశీలిస్తామని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.