01-04-2025 01:03:11 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): కంచ గచ్చిబౌలిలోని భూముల వివాదంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దఖాలైంది. గచ్చిబౌలిలో భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోర్టును అభ్యర్థిస్తూ వాటా ఫౌండేషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖాలు చేసింది. అత్యవసర పిటిషన్ గా విచారణకు స్వీకరించాలని వట ఫౌండేషన్ న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ఈ కేసును బుధవారం విచారించడానికి హైకోర్టు అంగీకరించింది.