10-03-2025 02:18:00 PM
హైదరాబాద్: సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun), నేషనల్ క్రష్ రష్మిక మందన కలిసి నటించిన చిత్రం పుష్ప2(Pushpa 2 movie profits). ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న పుష్ప2 చిత్రానికి వచ్చిన లాభాలపై తెలంగాణ హైకోర్టులో న్యాయవాది జీఎల్ఎన్ నరసింహారావు(Advocate Narasimha Rao) ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు వల్ల పుష్ప2(Pushpa 2) చిత్రానికి భారీగా ఆదాయం వచ్చిందని న్యాయవాది వెల్లడించారు. హోంశాఖ ప్రత్యేక ఉత్తర్వులిచ్చి మరి బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతిచ్చింది. బెనిఫిట్ షో, టికెట్ ధరల పెంపునకు అనుమతివ్వడానికి గల కారణాలేంటో చెప్పలేదని న్యాయవాది పేర్కొన్నారు. పుష్ప2 చిత్రానికి వచ్చిన లాభాలను చిన్న చిత్రాల బడ్జెట్ రాయితీకి, జానపద కళాకారుల పింఛను కోసం ఈ లాభాలను కేటాయించాలని నరసింహారావు కోరారు. విచారణను 2 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు తీర్పు కాపీని సమర్పించాలని న్యాయవాది ఆదేశించారు.