calender_icon.png 22 February, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై పిల్

21-02-2025 01:18:06 AM

* హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో వ్యాజ్యం

హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ప్రతిపక్ష నేత, గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శాసనసభా సమావేశాలకు హాజరయ్యేలా స్పీకర్‌తో పాటు స్పీకర్ కార్యాలయానికి ఉత్తర్వులు జారీ చేయాలంటూ గురువారం తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.విజయారెడ్డి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.

2023 డిసెంబర్ 16 నుంచి కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకావడం లేదని, కొత్త ప్రతిపక్ష నేతను ఎంపిక చేసే విధంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆదేశాలివ్వాలని పిటిషనర్ పిల్‌లో కోరారు. హైకోర్టు తనకున్న అధికారాలను వినియోగించి విపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. పిల్ హైకోర్టు రిజిస్ట్రీ పరిధిలో నంబర్ కేటాయించే దశలోనే ఉంది.