- ఏ వీధిలో చూసిన పందులే దర్శనమిస్తున్నాయి
- ఎన్నిసార్లు చెప్పినా గ్రామ కార్యదర్శి పట్టించుకోవడంలేదని ప్రజల ఆరోపణ
యాచారం ఫిబ్రవరి 11 : యాచారం మండల పరిధిలోని మల్ గ్రామంలో పందులు స్త్వ్రర విహారం చేస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా మురుగు కాలువలు, పరిసరాలను, సంత మార్కెట్ తదితర ప్రాంతాల్లో పందులు రాజ్యమేలుతు పరిసరాలను దుర్గంధ భరితంగా మారుస్తున్నాయి. పందుల విషయంలో గ్రామ కార్యదర్శి చర్యలు తీసుకోకపోతే రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు వాపోతున్నారు. అలాగే పందుల బెడదతో భయాందోళన కలిగిస్తోందని స్థానికులు వాపోతున్నారు.
పందుల పెంపకపుదారులు సొంత స్థలంలో పెంచాల్సింది పోయి కాలనీల్లో విడిచి పెడుతూ ప్రజలకు ఇబ్బంది కల్గిస్తున్నారు.అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పందుల వల్ల కాలనీలలో దోమల బెడద పెరిగిందని, బురద నీటిలో పందులు విహరిస్తూ ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
చిన్నారులు ఆడుకోవడానికి బయటికి పంపితే వ్యాధులు ప్రబలుతాయని జంకుతున్నరు అధికారులు పెంపకందారులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. పందుల నివారణకు తక్షణమే చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.