calender_icon.png 1 January, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పావురాల బెడద

11-09-2024 12:00:00 AM

హైదరాబాద్ మహానగరంలో పావురాల బెడద రోజు రో జుకు అధికమవుతోంది. ముఖ్యంగా కొందరు పని కట్టుకుని ట్యాం క్ బండ్, నాంపల్లి రైల్వేస్టేషన్ బయట, మొహంజాహీ మార్కెట్, మలక్ పేట, చార్మినార్ తదితర ప్రాంతాల్లో పావురాలకు పగటి నుంచి సాయంత్రం వరకు పావురాలకు మేత వేస్తున్నారు. దీని వల్ల ఒకే చోట అధిక సంఖ్యలో పావురాలు చేరుతున్నాయి. ఒకే చోట ఒకే రకం పక్షులు ఎక్కువగా ఉంటే మిగతా పక్షులు బెదిరి మరో ప్రాంతానికి వెళ్ళిపోతాయి.అంతేకాకుండా ఒకే చోట ఒకే రకం పక్షులు ఎక్కువ సంఖ్యలో ఉంటే అది అక్కడి పర్యావరణంపై ప్రభావం చూపుతుంది.

చుట్టుపక్కల నివాసం ఉండే మనుష్యులపై తీవ్ర ప్రభావం చూపి కొత్త ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. పక్షులు తమ ఆహారాన్ని తమంతట తామే వెతుక్కుని తినగలిగే స్థాయిలో ఉంటాయి. మనం అవి నివసించటానికి తగు వాతారణం కల్పిస్తే చాలు. మనం తగిన ఆలోచనతో, స్వీయ నియంత్రణతో ముందుకు సాగాలి, లేదంటే కష్టాలు తప్పవు.     

-- కప్పగంతు వెంకట రమణమూర్తి,సికింద్రాబాద్.