calender_icon.png 2 October, 2024 | 11:55 AM

అక్టోబర్ 22 నుంచి పికిల్‌బాల్ ప్రపంచకప్

18-09-2024 12:06:16 AM

తొలిసారి బరిలో భారత్

న్యూఢిల్లీ: పెరూ వేదికగా అక్టోబర్‌లో జరగనున్న పికిల్‌బాల్ ప్రపంచకప్‌లో భారత్ తొలిసారి పాల్గొననుంది. అక్టోబర్ 22 నుం చి 27 వరకు జరగనున్న టోర్నీలో భారత్ నుంచి రెండు జట్లు (తొమ్మిది మంది) బరిలోకి దిగనున్నాయి. ధీరెన్ పటేల్ నేతృ త్వంలో హిమాన్ష్ మెహతా, సూరజ్ దేశా య్, రక్షికా రవి, అనిశి సేత్‌లతో కూడిన తొ లి జట్టు ఓపెన్ కేటగిరీలో.. సీనియర్స్ 50 ప్లస్ కేటగిరీలో నోజర్ ఆమ్లాస్‌దివాలా, కిర ణ్ సలియన్, బెలా కొత్వాని, సుజయ్ పరేఖ్‌ల బృందం పోటీల్లో పాల్గొననున్నాయి. పికిల్ బాల్ టెన్నిస్ క్రీడను పోలి ఉంటుంది. ఆటగాళ్లు రాకెట్‌కు బదులు ప్యాడల్స్‌ను ఉపయోగిస్తారు. పికిల్‌బాల్ గేమ్‌ను నిర్వహించే కోర్టు మొత్తం 44 అడుగుల పొడవు, 20 అ డుగుల వెడల్పు ఉంటుంది.

టెన్నిస్‌లో రెండు ఫాల్ట్‌లు చేస్తే సర్వీస్ పోయినట్లే.. అదే పికిల్‌బాల్‌లో కేవలం ఒక్క ఫాల్ట్ మాత్రమే ఉంటుంది. డబుల్స్‌లో ఒకసారే సర్వ్ చేసే అవకాశముంటుంది. టెన్నిస్‌లో ఎవరు సర్వ్ చేసినా పోయినప్పుడు ప్రత్యర్థికి పాయింట్ ఇస్తారు. కానీ పికిల్‌బాల్‌లో మాత్రం సర్వ్ చేసినప్పుడే పాయింట్లు వస్తాయి. ప్రతి సెట్ 11 పాయింట్లకు ముగియనుండగా.. రెండు పాయింట్ల తేడాతో విజేతను ప్రకటిస్తారు. సర్వ్ చేసినప్పుడు బంతి కచ్చితంగా నెట్‌ను దాటాల్సిందే. సర్వ్ సమయంలో ‘నో వ్యాలీ జోన్’ వద్ద బంతిని ప్రత్యర్థి అందుకోకూడదు.