23-03-2025 12:00:00 AM
ప్రమాదం లేదా ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా చలనం కోల్పోయిన అవయవాల్లో కదలికల కోసం ఫిజియోథెరఫీ చేస్తుంటారు. అలాగే నడుము, మెడ, భుజాలు, ఆర్థరైటిస్ నొప్పులు దీర్ఘకాలం వేధిస్తున్నా వాటి నుంచి ఉపశమనం కోసం ఈ విధానాన్ని అనుసరిస్తారు.
ప్రయోజనాలు
* ప్రమాదాలు, పక్షవాతం కారణంగా కదల్లేని స్థితికి చేరుకుని నడవాలన్నా, లేవాలన్నా ఇతరులపై ఆధారపడతారు. వీరు రోజుల తరబడి మంచానికే పరిమితం కావడం వల్ల కండరాలు బలహీనంగా మారతాయి. వీరిలో కండరాలు తిరిగి బలోపేతం కావడానికి ఫిజియోథెరపీ సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
* ఎముకలు విరగడం, చేతులు, కాళ్లను కదలించలేని, నడవలేని పరిస్థితులలో ఉన్నవారు క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయించుకుంటే ఒకట్రెండు నెలల్లోపే ఫలితం కనిపిస్తుంది.
* తలపై దెబ్బతగిలినా, బ్రెయిన్ డ్యామేజ్ అయినా, వెన్నెముక దెబ్బతిన్నా, చేతులు, కాళ్లు సరిగా కదపలేకపోయినా క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ వ్యాయామాల వల్ల ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.