జిల్లాలో యోగా పోటీలు నిర్వహించడం అభినందనీయం
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్..
కామారెడ్డి (విజయక్రాంతి): యోగాతో శారీరకంగా మానసికంగా వృద్దిచెందుతారని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి యోగా చాంపియన్ షిఫ్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విద్యతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. యోగపోటీల్లో పాల్గొని విద్యార్థులు రాణించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలన్నారు. రెండు రోజుల పాటు జరిగే పోటీల్లో పాల్గొంటున్న బాలబాలికలకు ఆల్ దా బెస్ట్ చెప్పారు. ప్రభుత్వం క్రీడాలపై దృష్టి సారించిందన్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర జాతీయస్థాయిలో పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మాట్లాడుతూ.. యోగ పోటీల్లో అన్ని ఉమ్మడి జిల్లాల నుండి 140 మంది బాలబాలికలు పాల్గొంటున్నట్లు తెలిపారు. క్రీడాల్లో పాల్గొనేవారికి ప్రసూతి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘాల బాధ్యులు మాట్లాడారు. రాష్ట్రస్థాయి పరీశీలకులు సతీష్, పుష్పలిల, ఎస్‌జీఎఎఫ్ కార్యవర్గ సభ్యులు, పీఈటీలు, కోచ్ మేనేజర్లు పోటీల్లో పాల్గొనే బాలబాలికలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కే డిగ్రీ కళాశాల సీఈవో జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.