calender_icon.png 27 January, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరాటే మార్షల్ ఆర్ట్స్‌తో దేహదారుఢ్యం

26-01-2025 12:58:18 AM

కింగ్ షోటోకాన్ ఫౌండర్ జహంగీర్ పాషా ఖాద్రీ

మహబూబ్‌నగర్, జనవరి 25 (విజయ క్రాంతి): కరాటే మార్షల్ ఆరట్స్‌తో దేహదారుఢ్యం పెంపొందుతుందని కింగ్ షోటోకాన్ కరాటే ఇండియా ఫౌండర్ జహంగీర్ పాషా ఖాద్రీ అన్నారు. జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ రోడ్డు స్కూల్ ఆవరణలో శనివారం విద్యార్థులకు బెల్టులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటే లో మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వివిధ బెల్టులు అందజేసినట్లు తెలిపారు.

ఉమ్మ ఖిజ్రా బేగం గ్రీన్ నుంచి బ్లూ బెల్టు, కె.తనిష్ ఎల్లో నుంచి అరెంజ్ బెల్ట్, మహ్మద్ ఇబ్రెజ్ వైట్ నుంచి ఎల్లో, మహ్మద్ బిలాల్ అజం వైట్ నుంచి ఎల్లో బెల్టులు పొందినట్లు తెలిపారు. గత కొన్నేళ్ల నుంచి కింగ్ షోటో కాన్ విద్యార్థులు కరాటే పోటీల్లో పతకాలు సాధిస్తున్నట్లు తెలిపారు.