calender_icon.png 10 January, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులను చితకబాదిన ఫిజికల్ డైరెక్టర్

10-01-2025 12:00:00 AM

కొండపాక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఘటన వివరాలు సేకరించిన సిద్దిపేట జిల్లా జడ్జి స్వాతి రెడ్డి

కొండపాక, జనవరి  9: కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 30 మంది విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయుడు వాసు చితకబాదాడు. విషయం తెలుసుకున్న సిద్దిపేట జిల్లా జడ్జి స్వాతి రెడ్డి గురుకుల పాఠశాలను గురువారం సందర్శించారు. విద్యార్థుల తరగతి గదులు, వంట గదులు, మరుగుదొడ్లు, వంట సామాగ్రి, మెనూను పరిశీలించారు.

బాధిత విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు స్టడీ అవర్‌కి లేటు అవుతుందని వాచ్మెన్ భరత్ చర్చించిన దుడ్డు కర్రతో సార్ స్నానం చేసే చోటకి వచ్చి కొట్టారని వివరించారు. కాళ్లపై, చేతులపై, పిరుదులపై, ఇష్టం వచ్చినట్టు కొట్టారని విద్యార్థులు జడ్జి స్వాతి రెడ్డికి చూపించారు. విద్యార్థులు అధైర్య పడవద్దని ఉన్నత లక్ష్యంతో చదివి ఉత్తమ విద్యార్థులుగా ఎదగాలని జడ్జి సూచించారు. పీడీ కొట్టడం బాధాకరమని ఉన్నతాధికారులకు సంఘటనపై నివేదిక సమర్పిస్తానని తెలిపారు.

వాసును సస్పెండ్ చేయాలి: వంటేరు

గురుకుల సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో బుధవారం వ్యాయామ ఉపాధ్యాయుడు వాసు విద్యార్థులను తీవ్రంగా కొట్టడాన్ని ఖండిస్తున్నామని ఆ ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని ఎఫ్ డి సి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ అన్నారు.