కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళవారం రాత్రి ఓ పాఠశాలలో పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్ మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మార్తాండ గ్రామానికి చెందిన ఫిజికల్ డైరెక్టర్ మల్లయ్య(35) రోడ్డు ప్రమాదంలో మంగళవారం రాత్రి మృతి చెందారు. మృతుడు పెద్ద కోడపుగల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా విధులను నిర్వర్తిస్తున్నారు. శిక్షణ నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్న సమయం పిట్లం మండలం తిమ్మానగర్ తండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పిట్లం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.