calender_icon.png 21 January, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతో శారీరక, మానసిక వికాసం

21-01-2025 01:45:50 AM

మానసిక, శారీరక వికాసానికి ఆటలు ఎంతో అవసరం రాచకొండ సీపీ సుధీర్ బాబు సరూర్ నగర్ ఇండోర్  స్టేడియంలో ప్రారంభమైన 6వ రాచకొండ పోలీస్ స్పోరట్స్  మీట్ 2025

ఎల్బీనగర్, జనవరి 20 : క్రీడలు వ్యక్తుల మానసిక వికాసానికి మరియు శారీరక వికాసానికి తోడ్పడుతాయని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ పేర్కొ న్నారు. సరూర్‌నగర్ స్టేడియంలో సోమవారం ప్రారంభమైన 6వ రాచకొండ పోలీస్ కమిషనరేట్ వార్షిక స్పోరట్స్ మీట్-2025 పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ..

క్రీడలు మన జీవితంలో ముఖ్య భాగమని, వివిధ రకాల మానసిక శారీరక ఒత్తిడులను అధిగమించడానికి క్రీడలు ఎంతో ఉపకరిస్తాయన్నారు. రాచకొండ పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, గరిష్ఠ శిక్షారేటు సాధిస్తూ గొప్పగా పని చేస్తున్నారని తెలిపారు. పోలీసులు విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడులతోపాటు వివిధ రకాల సవాళ్ల నుంచి ఉపశమనం పొందేలా,  నూతనత్తే జంతో తమ విధి నిర్వహణలో పాల్గొనేలా చేయడానికి స్పోరట్స్ మీట్ నిర్వహిస్తున్నా మని పేర్కొన్నారు.

క్రీడా పోటీల ద్వారా వివిధ పోలీస్ విభాగాల మధ్య సుహృద్భావ వాతావరణం, సమిష్టితత్వం ఏర్పడుతుంద న్నారు.  మూడు రోజుల పాటు జరిగే పోటీ ల్లో అన్ని రకాల ప్రధాన క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. గెలుపోటముల కంటే పోరాటమే ధ్యేయంగా క్రీడల్లో పాల్గొనాలని పేర్కొన్నారు.

ఈ పోటీల్లో పోలీసు సిబ్బంది జట్లు మాత్రమే కాక మినిస్టిరియల్ సిబ్బందికి కూడా ఒక ప్రత్యేక జట్టు ఉంటుందని, అన్ని జట్లూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని, ఆటల్లో ఎటువంటి అవకతవకలకు పాల్పడకూడదని సూచించారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా పోటీలు నిర్వహిస్తామని, రాచకొండ పరిధిలో పనిచేస్తున్న అన్ని పోలీసు విభాగాల సిబ్బంది మరియు మినిస్టీరియల్ సిబ్బంది కూడా ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. 

కార్యక్రమంలో డీసీపీ యాదాద్రి రాజేష్ చంద్ర ఐపీఎస్, డీసీపీ ఎల్బీనగర్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్, డీసీపీ మల్కాజిగిరి పద్మజ ఐపిఎస్, డీసీపీ క్రైమ్ అరవింద్ బాబు, డీసీపీ మహేశ్వరం సునీత రెడ్డి, ఎస్వోటీ డీసీపీలు రమణారెడ్డి, మురళీధర్, డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్, డీసీపీ అడ్మిన్ ఇందిర, డీసీపీ సైబర్ క్రైమ్ నాగలక్ష్మి, డీసీపీ ఉమెన్ సేఫ్టీ ఉషా విశ్వనాథ్, ఏసీపీ ఐటీ సెల్ నరేందర్ గౌడ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.