calender_icon.png 20 April, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం పెట్టాలి

09-04-2025 01:42:42 AM

11లోగా ప్రభుత్వం ప్రకటన చేయాలి

ఎమ్మెల్సీ కవిత డిమాండ్

ఇందిరా పార్క్‌లో దీక్ష

ముషీరాబాద్, ఏప్రిల్ 8: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం ఇంది రా పార్కు వద్ద దీక్ష చేశారు. జాగృతి, యూనైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తం గా ఈ దీక్షా కార్యక్రమానికి వేలాది మంది బీసీలు, ప్రజలు తరలివచ్చారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఏప్రిల్ 11లోగా విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాం డ్ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో చాలా ప్రమాద కరమైన ఆర్టిఫి-షియల్ ఇంటెలిజెన్స్‌తో ఫొటోలు రూపొందిం చారని కాంగ్రెస్ ఆరోపి స్తూ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖం డించారు.

బీసీ బిల్లుల ఆమోదానికి కేంద్రంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తేవాల-న్నారు. బీజేపీ డీఎన్‌ఏలో బీసీ, దళిత వ్యతిరేకత పెరిగిందన్నారు. గిరిజన బిడ్డ రాష్ట్రపతి అయినా గౌరవం దక్కకపోతే పోరాటం తప్ప మనకు ఇతర మార్గమేముందని ప్రశ్నించారు. దళిత నేత, రాజస్థాన్ ప్రతిపక్ష నేత  కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, సాహిత్య అకాడెమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.