calender_icon.png 22 April, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా విద్యకు ఆద్యుడు ఫూలే !

12-04-2025 12:49:41 AM

రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి  దామోదర్ రాజనర్సింహ 

సంగారెడ్డిలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు

సంగారెడ్డి, ఏప్రిల్ 11 (విజయ క్రాంతి) అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయుడు మహాత్మా జ్యోతి రావ్ ఫూలే అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శుక్రవారం మహాత్మ జ్యోతి రావ్ ఫూలే 199వ జ యంతిని పురస్కరించుకొని సంగారెడ్డి ము న్సిపాలిటీ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయం సమీపంలో ఉన్న ఫూలే విగ్రహానికి టీజీఐఐసీ నిర్మల జగ్గారెడ్డి,  జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ లతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భం గా మంత్రి మాట్లాడారు. ఆడపిల్లల చదువు కోసం తన జీవితాన్ని అంకితం చేశాడన్నారు. సత్యశోధక సమాజం ద్వారా నిరుపేదలకు వివాహాలు జరిపించాడన్నారు. ఎన్నో పాఠశాలలు, వసతి గృహాల ద్వారా అనేకమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగును నింపిన మహనీయుడు అన్నారు.  ఆయన చూపిన మార్గమే ఈనాటి అభివృద్ధికి మూలాధారంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు చంద్రశేఖర్, మాధురి, వివిధ శాఖల జిల్లా అధికారులు ,కుల సం ఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫూలే గొప్ప సంఘసంస్కర్త : ఎమ్మెల్యే మాణిక్ రావు 

జహీరాబాద్, ఏప్రిల్ 11 :జ్యోతిరావు ఫూలే గొప్ప సంఘ సంస్కర్తని, ఆయన ప్రజల గుండెల్లో ఎల్లవేళలా ఉంటారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు అన్నారు. శుక్రవారం  జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జ్యోతిరావు ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశా రన్నారు.

ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, జహీరాబాద్, ఝరాసంగం బీఆర్‌ఎస్ అధ్యక్షులు తట్టు నారాయణ, వెంకటేశం, నాయకులు మాధవి కిరణ్, బండి మోహన్, మంజుల, అనుషమ్మ గౌడ్, శివప్ప, దత్తాత్రేయ, అలీ, వెంకట్, విశ్వేశ్వర్, రాజేష్, తులసి దాస్, గుప్తా రాజా రమేష్, జగదీశ్వర్, ఆనందం, ప్రవీణ్ పాటిల్, ఎజాజ్ బాబా, గణేష్,  నర్సింహారెడ్డి, దీపక్, లక్ష్మీకాంత్, మోహన్ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 

 పటాన్ చెరు, ఏప్రిల్ 11 : సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి మహాత్మ జ్యోతిరావు ఫూలే అని, బహుజన చైతన్య దీప్తి, మహిళల విద్య కోసం ఆయన విశేష కృషి చేశారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అ న్నారు. మహాత్మ జ్యోతిరావు ఫూలే జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని కొనియాడారు.  భవిష్యత్తు తరాలకు వారి ఆశయా లను అందించాలన్న సము న్నత లక్ష్యంతో సొంత నిధులతో పటాన్ చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సమీపంలో జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాల ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. 

జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకొని.. పటాన్ చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖాన వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎ మ్మెల్యే సత్యనారాయణ, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ సపానా దేవ్, కొమరగూడెం వెంక టేష్, నరసింహారెడ్డి, రుద్రారం శంకర్, పృ థ్వీరాజ్, అశోక్, ప్రకాష్ రావు, నర్రా బిక్షపతి, శంకర్, కుమార్, నీవర్తిదేవ్, చంద్రశేఖర్, దళిత సంఘాల ప్రతినిధులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

బడుగు వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు ఫూలే 

మెదక్, 11 ఏప్రిల్(విజయ క్రాంతి) బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం మహాత్మ జ్యోతి రావ్ ఫూలే చేసిన కృషి ఫలితాలే నేటి సమాజం అనుభవిస్తున్న ఫలాలు అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం మెదక్ ధ్యాన్ చాంద్  చౌరస్తాలో  ఘనంగా మహాత్మా జ్యోతి రావ్ ఫూలే 199వ జయంతి వేడుకలు నిర్వహించారు. 

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోజిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ ఇతర ప్రజాప్రతినిధులు బీసీ సంఘ నాయకులతో జ్యోతి రావ్ ఫూలే  విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహా త్మ జ్యోతిరావ్ ఫూలే 199 జయంతి ఉత్సవాలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.