12-04-2025 12:49:40 AM
కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
గద్వాల, ఏప్రిల్ 11 ( విజయక్రాంతి ) : సామాజిక సమానత్వం,విద్యా హక్కు, మహి ళా సాధికారత కోసం తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అన్నారు.శుక్రవారం గద్వాల్ కేంద్రంలోని కృష్ణవేణి చౌక్ వద్ద మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతి సందర్భంగా గద్వాల్ స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తో కలిసి విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేశారని అన్నారు.ఆయన బాల్య వివాహాల నిర్మూలనకు, మహిళల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలని విశ్వసించిన ఆయన, తొలి బాలికల పాఠశాలను ప్రారంభించి చారిత్రక పాత్ర పోషించారని కొనియాడారు.
ఆయన ఆశయాలను నేడు కూడా సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని, పూలే గారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సామాజిక న్యాయం కోసం కృషి చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూల మాలలు చేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, నర్సింగ రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్వ హనుమంతు, జిల్లా బి. సి.సం క్షేమ శాఖ అధికారి రమేష్ బాబు, ఎస్సీ సంక్షేమ అధికారి సరోజ,జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఘనంగా పూలే జయంతి
మహబూబ్ నగర్ ఏప్రిల్ 11 (విజయ క్రాం తి) : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ దగ్గర ప్రజా సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు జ్యోతి రావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో పూలే గ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.రామకృష్ణ గౌడ్, టీజీఓ జిల్లా అధ్యక్షులు ఎస్.విజ యకుమార్, జిల్లా కార్యదర్శి కె.వరప్రసాద్ ,ఉపాధ్యక్షులు బాలుయాదవ్, మహాత్మ జ్యోతిరావు పూలే గవిగ్రహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘ టించారు.
ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షులు ఆర్.రవీందర్, ఎం. యాదగిరి,ట్రెజరర్ కె.టైటస్‌పాల్,ఉపాధ్యక్షులు ఎల్.తానాజీ గారు,శ్రీ నుగౌడ్, బాలుయాదవ్ జాయింట్ సెక్రటరీ నరేష్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్.గం గాధర్ తదితరులు ఉన్నారు.
అక్షరాస్యతే అన్నిటికీ ప్రధానం: డాక్టర్ గుమ్మడి వెన్నెల
గోపాలపేట ఏప్రిల్ 11 : కుల వివక్షత ను వీడనాడాలని చాటిన మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే అని తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ డాక్టర్ గుమ్మడి వెన్నెల అన్నా రు. ఏఐసీసీ పిసిసి పిలుపుమేరకు శుక్రవారం వనపర్తి జిల్లా గోపాలపేట మండలం తాడిపర్తి గ్రామంలో జై భీమ్ జై బాబు జై సంయు ధాన్ కార్యక్రమంలో భాగంగా ఆ మె పాల్గొన్నారు.
సమాజంలో పట్టిపీడిస్తున్న చెడులపై పోరాటానికి ఆయన చేసిన కృషి వర్ణించరానిదని ఆమె అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ మండల కాంగ్రె స్ పార్టీ అధ్యక్షులు గణేష్ గౌడ్ ఓ బి సి జిల్లా అధ్యక్షులు కోట్ల రవి కాంగ్రెస్ నాయకులు రాములు జానకి రాములు దేవన్న యాదవ్ రమేష్ పాతపల్లి శేఖర్ పాల్గొన్నారు .
మహబూబ్ నగర్ ఏప్రిల్ 11 (విజయ క్రాంతి) : పట్టణంలోని వానగుట్ట దగ్గర ఉన్న ఈదిగా చుట్టూ రక్షకుడు నిర్మించేందుకు అ వసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మె ల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవా రం మహబూబ్ నగర్ పట్టణంలోని వాన గుట్టలో ఉన్న ఈద్గా చుట్టూ రక్షణ గోడ ని ర్మాణం చేపట్టేందుకు ఈద్గా కమిటీ సభ్యులు అధికారులతో కలిసి ఆయన పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ పవిత్ర రంజాన్, బక్రీద్ పర్వదినాల్లో ముస్లిం సోదరులు ఇక్కడ వచ్చి ప్రత్యేక నమాజ్ చేసుకుంటారని, ఈద్గాకు రక్షణ గోడ లేకపోవడం వలన ఈద్గా అన్యాక్రాం తం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అలాగే ఇక్కడ వచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకునే వారు కూడా గతంలో కంటే ఎక్కువ భక్తులు వచ్చి ప్రార్థనలు నిర్వహించుకోవడం వలన ఇబ్బందులు ఎదురౌ తున్నాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు సాదుల్లా, శ్రీనివాస్ యాదవ్ , ప్రవీణ్ కుమార్, హఫీజ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు , ఖాజా పాషా, రషేద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.