calender_icon.png 20 April, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు ఫూలే

12-04-2025 01:21:17 AM

వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు

హనుమకొండ, ఏప్రిల్ 11 (విజయక్రాంతి):  మహ్మత జ్యోతి రావు ఫూలే 199వ జయంతి సందర్భంగా  నేడు ములుగు రోడ్డు జంక్షన్‌లోని జ్యోతి ఫూలే విగ్రహాని దేవదాయ శాఖలమంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య,  వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి లతో కలిసి వర్ధన్నపేట  ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పూలమాల వారి  వేసి ఘనంగా నివాళులర్పించారు. 

సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు, సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని ఫూలే భావించాడన్నారు.  1864లో బాలహత్య ప్రతిబంధక్ గృహ స్థాపించి, వితంతువులైన గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచాడు. సామాజిక ప్రజాస్వామ్యం సాధించటం భారత దేశానికి ముఖ్యమనే మహత్తర సందేశాన్ని అందించిన మహాత్మ ఫూలే తన గురువు అని డా బి.ఆర్. అంబేద్కర్ ప్రకటించారు.

కూడా ఛైర్మన్ ఇనుగాల వెంకట్రాం రెడ్డి, వరంగల్ , హనుమకొండ జిల్లాల కలెక్టర్లు సత్యా శారద దేవి, ప్రావిణ్య,  మున్సిపల్ కమిషనర్ అశ్విని తనాజి, అదనపు కలెక్టర్లు. అధికారులు ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, మండల, గ్రామ, డివిజన్ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.