calender_icon.png 14 April, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల పోరాటంతోనే ఫూలే విగ్రహ ఏర్పాటు

13-04-2025 02:09:14 AM

నెక్లెస్ రోడ్డులో విగ్రహ ఏర్పాటు నిర్ణయం చరిత్రాత్మకం

జాజుల శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): దశాబ్దాలుగా బీసీలు చేసిన పోరాటం ఫలితంగానే నగరంలోని నెక్లెస్ రోడ్‌లో సామాజిక సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిబా ఫూలే విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నెక్లెస్ రోడ్‌లో ఫూలే విగ్రహం, స్మారకం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమన్నారు.

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఫూలే విగ్రహానికి బీసీ సంఘాల ఆధ్వర్యంలో పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఆమోదముద్ర వేయడం అభినందనీయమన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో సామాజిక రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామని కాంగ్రెస్ తీర్మానించడాని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

గత ప్రభుత్వం ఫూలే పూలే విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి పది జయంతులైనా ఏర్పాటు చేయలేదన్నారు. బీసీల ఆకాంక్షలను గౌరవించి బీసీల ఆత్మ అయినటువంటి ఫూలే విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టికి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కవుల జగన్నాథం, నాయకులు జాజుల లింగం, తారకేశ్వరి, సమత యాదవ్ మాదేశి రాజేందర్, పాలకూరి కిరణ్, ఎల్లయ్య, శ్యామ్, సందీప్ ముదిరాజ్ పాల్గొన్నారు.