12-04-2025 12:24:00 AM
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
చేవెళ్ల, ఏప్రిల్ 11: మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయ సాధనకు కృషి చేయాలని ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఫూలే జయంతి సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు అత్తెల్లి అనంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంతో కలిసి ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఫూలే అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనకు, మహిళల ఉద్ధరణకు చేసిన కృషిని కొనియాడారు. 1873లో సత్యశోధక్ సమాజ్ను స్థాపించి, అణగారిన వర్గాలకు సమాన హక్కుల కోసం పోరాడారని, అన్ని మతాలు, కులాల వారిని ఒక తాటిపైకి తెచ్చారని గుర్తు చేశారు. మహిళల చదువు కోసం కృషి చేయాలిన ఆయన తన సతీమణి సావిత్రిబాయితో కలిసి1848లో పూణేలో బాలికల కోసం తొలి పాఠశాలను ప్రారంభించారని, వితంతువుల కోసం ఆశ్రయం కల్పించారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ శర్వలింగం, బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు మెంబర్ మాణిక్య రెడ్డి, నాయకులు అడేట్ల శ్రీనివాస్, కుంచం శ్రీనివాస్, ఇంద్రసేన రెడ్డి, కృష్ణ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అభిలాష్ కృష్ణ, ప్రవీణ్, మల్ల రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వెంకటేష్, రవీందర్, ప్రకాష్, భాస్కర్, మధుకర్, సుధాకర్ రెడ్డి, మహేందర్, హర్షిత్, జయసింహ, చాకలి శ్రీనివాస్, హన్మంత్ యాదయ్య, నవీన్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.