calender_icon.png 16 October, 2024 | 2:20 PM

ఫూలే ఓవర్సీస్ పథకం నిధులు విడుదల చేయాలి

16-10-2024 02:46:05 AM

గురుకులాల అద్దెలు చెల్లించాలి

మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): గత ప్రభుత్వ హయాంలో మహా త్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకంలో ఆర్థిక సాయం పొందిన 65 మంది బీసీ విద్యార్థులకు ప్రభుత్వం నిధులెందుకు విడుదల చేయడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.

మంగళవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదవాల నే ఉద్దేశంతో కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారన్నారు. పేద పిల్లలకు లబ్ధి చేకూ ర్చే ఓవర్సీస్ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. పేర్లు మార్చడం, విగ్రహాలు తొలగిం చడం సులభం కానీ, హామీలను నిలబెట్టుకోవడం కష్టమన్నారు.

కాంగ్రెస్ పార్టీకి కామా రెడ్డి బీసీ డిక్లరేషన్ గుర్తుందా? మొదటి అసెంబ్లీ సమావేశంలోనే బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. ప్రభుత్వం 10 నెలలుగా అద్దె భవనా ల్లో కొనసాగుతున్న గురుకులాలకు అద్దెలు చెల్లించకపోవడంతో జయశంకర్ భూపాలపల్లిలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌కు యజమాని తాళం వేసే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ పాలనలో గురుకులాల నిర్వహణ అధ్వాన్న స్థితికి చేరిందన్నారు. విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారమై విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. పోలీస్ కానిస్టేబుళ్ల పట్ల జరుగుతున్న శ్రమ దోపిడీ విషయమై గతంలో అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. అధికారం చేపట్టిన తర్వాత ఊసరవెల్లిలా మారి వారి శ్రమను దోచుకుంటున్నారన్నారు.

టీఎస్‌ఎస్పీ కానిస్టేబుళ్లు 15 రోజులకు ఒకసారి బదులుగా నెలకు ఒకసారి ఇంటికి వెళ్లే విధంగా సెలవుల విధానం మార్చడం దుర్మార్గమన్నారు. వారాల పాటు కుటుంబాలకు దూరం చేయడమే పోలీసులకు ఇచ్చిన దసరా, దీపావళి కానుక అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

సెలవుల విషయంలో పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో సివిల్, ఏఆర్, ఇతర విభాగాల పోలీసులకు 15 రోజులు టీఏ ఇచ్చేదని, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఏడు రోజులకు కుదించిందన్నారు. వారి పొట్టపై కొట్టకుండా పాత విధానం ప్రకారమే 15 రోజుల టీఏ ఇవ్వాలని సూచించారు.