19-04-2025 02:00:49 AM
కోదాడ, ఏప్రిల్ 18: మూడు వేల ఏళ్ళ కుల వ్యవస్థ బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మానవతావాది మహాత్మా పూలే సినిమాను ఏటువంటి సెన్సార్ లేకుండా యధాతధంగా విడుదల చేయాలని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి వెంకటేశ్వరరావు. సంస్థ బాధ్యులు పందిరి నాగిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..
గురువారం కోదాడ బస్టాండ్ ఎదుట నెలకొని ఉన్న అంబేద్కర్ వద్ద నిరసన తెలిపిన అనంతరం మాట్లాడారు. ముత్తవరపు రామారావు, పంది తిరుపతయ్య, రామ నరసయ్య, బడుగుల సైదులు, భిక్షం, హరికిషన్ రావు, నర సింహారావు, ఉదయగిరి, పట్టాభి రెడ్డి, నరేష్, మురళి, రాధాకృష్ణమూర్తి, గోపాల్ పాల్గొన్నారు