11-04-2025 06:41:02 PM
మందమర్రి (విజయక్రాంతి): మహాత్మా జ్యోతి రావ్ పూలే 198వ జయంతి వేడుకలు బీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏరియా లోని కెకె ఒసిపి గనిపై పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జండా ఆవిష్క రించి, కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుంటూ పండుగ వాతా వరణాన్ని నెలకొల్పారు. ఈ సందర్బంగా సభ్యులు మాట్లాడారు. పూలే సమాజా నికి చేసిన సేవలు, సమాజ హితానికి చేసిన కృషి, వారి జీవిత చరిత్ర, బిసి. అసోసియే షన్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
సింగరేణి చరిత్రలో మొట్టమొదటి సారిగా బిసి లైసనింగ్ ఆఫీసర్ ను నియమించి పూలే జయంతి వేడుకలకు నిధులు మంజూరు చేసిన సిఎండి బలరామ్ నాయక్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బిసి అసోసియేషన్ ఏరియా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గౌడ్, కమిటీ సభ్యులు కొట్టె రమేష్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం విజయప్రసాద్, మేనేజర్ రామరాజు, సిఎంఓఎ అధ్యక్షులు రమేష్, అధికారులు, యూనియన్ ల ప్రతినిధులు పాల్గొన్నారు.