12-04-2025 01:11:50 AM
ఖమ్మం, ఏప్రిల్ 11 (విజయక్రాంతి):- జ్యోతిరావు ఫూలే 199 వ జయంతి వేడుకలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘ నంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో అయన చి త్రపటానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , రాష్ట్ర గిడ్డంగుల సం స్థ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసి, గొప్ప మార్పు తీసుకొచ్చారని అన్నారు.కార్యక్ర మంలో వివిధ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గొప్ప సామాజిక ఉద్యమకారుడు ఫూలే
అట్టడుగు వర్గాల కోసం అసమాన వ్యవస్థపై మొట్టమొదటిసారిగా తిరుగుబాటు చేసిన గొప్ప విప్లవ కారుడు మహాత్మ జ్యోతిరావు ఫూలే అని సిపిఎం జిల్లా కార్యదర్శి ను న్న నాగేశ్వరరావు అన్నారు.స్థానిక సుందరయ్య భవనంలో జరిగిన ఫూలే జయంతి కార్యక్రమంలో ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి కార్యదర్శి వై విక్రమ్ అధ్యక్షతన జరిగిన జయంతి సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యు లు బండి రమేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యు లు యర్రా శ్రీనువాసురావు నాయకులు మెరుగు సత్యనారాయణ దొంగలు తిరుపతిరావు ఎంఏ జబ్బార్, ఎన్ మనోహర్ పి రమ్య, భూక్య శ్రీను, బోడప్పట్ల సుదర్శన్ వై శ్రీనివాసరావు, సదానందం, నెల్లూరి వీరబాబు నాగుల్ మీరా, నర్రా రమేష్, జే వెంకన్న బాబు తుడుం ప్రవీణ్ సుధాకర్, అమరావతి, పగడాల నాగేశ్వరరావు, గుమ్మడి బిక్షం రెడ్డి బి సాగర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్ లో ....
మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు తెలంగాణ భవన్, జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య మాట్లాడు తూ, మహాత్మా జ్యోతిబా ఫూలే భారతదేశంలో సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటం, మహిళా విద్యకు ప్రాధాన్యతనిచ్చిన విధానం, కులవ్యవస్థను ఎదుర్కొన్న ధై ర్యం, ఆయన స్థాపించిన సత్యశోధక్ సమా జం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడానికి చేసిన కృషి గురించి ప్రత్యేకంగా చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, ఖమ్మం నగర పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు, నాయకులు హెచ్ ప్రసాద్, ఆరెంపుల వీరభద్రం, ముత్యాల వెంకటప్పారావు, బిచ్చాల తిరుమలరావు, మేకల సుగు ణ రావు, భారతి, వుబ్బలపల్లి నిరోషా, మరికంటి వెంకన్న, కోడి రెక్క ఫ్రాన్సిస్, అబ్బాస్, వెంకట్, ఉద్యమకారులు డోకుపర్తి సుబ్బారావు, గుండ్లపల్లి శేషగిరిరావు, లింగనబో యిన సతీష్, కోడిరెక్క ఉమాశంకర్, దరిపెల్లి వీరబాబు, నగర ప్రచార కార్యదర్శి షేక్ షకీనా తదితర నాయకులు పాల్గొన్నారు.
సామాజిక అసమానతనలు తొలగించడమే ఫూలే ఆశయం
చదువుతోనే జీవితంలో మార్పు సాధ్యమని విద్య యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహనీయులు మహాత్మా జ్యోతిబా ఫూలే అని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మ జ్యోతిబా ఫూలే 199వ జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి జి. జ్యోతి, కలెక్టరేట్ పరిపాలన అధికారి అరుణ, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత, ఓబిసి జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, బీఎస్పీ పార్టీ జిల్లా ఇం చార్జీ అయితగాని శ్రీనివాస్ గౌడ్, జాతీయ బిసి సంక్షేమ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. కృష్ణమాచార్యులు, దాసరి సంఘం జిల్లా ప్ర ధాన కార్యదర్శి శివకృష్ణ, దొడ్డి కొమురయ్య సినీ నిర్మాణ కమిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ రెహ్మాన్, తెలంగాణ యాదవ మహాసభ జి ల్లా కార్యదర్శి కె.రోశయ్య యాదవ్, తెలంగాణ యాదవ మహాసభ జిల్లా వర్కింగ్ ప్రె సిడెంట్ మల్సూర్ యాదవ్,
ఎంబీసీ రాష్ట్ర కో కన్వీనర్, దూదేకుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు షేక్ షకీన, తెలంగాణ యాదవ సంఘం అధ్యక్షులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, ఉద్యోగులు, సాంస్కృతిక సారధి కళాకారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.