calender_icon.png 18 April, 2025 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఫూలే జయంతి వేడుకలు

11-04-2025 06:26:22 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను శుక్రవారం పట్టణ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు మాట్లాడుతూ... మహాత్మా జ్యోతిరావు ఫూలే సామాజిక సమానత్వం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. ప్రతి ఒక్కరు జ్యోతిరావు పూలే ను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, మాజీ పుర చైర్మన్ జంగం కళ, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజిజ్, గోపు రాజం, ప్రేమ్ సాగర్, బత్తుల వేణు, శివ కిరణ్, కుర్మ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.