calender_icon.png 18 April, 2025 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో ఘనంగా పూలే జయంతి వేడుకలు

11-04-2025 04:40:40 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లిలో శుక్రవారం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల వద్ద గల మహనీయుల విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేసుకొని వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు.

వివక్షపై పోరాటం చేసిన మహాయోధుడని, విద్యకు ఎనలేని ప్రాముఖ్యత ఇచ్చిన మహాత్ముడు అని అన్నారు. ఉపాధ్యక్షులు నాగుల కిరణ్ బాబు, బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు దాగం శ్రీనివాస్ లు మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిబాపూలే ఆశయాన్ని నెరవేర్చేలా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మందమరి పట్టణ అధ్యక్షుడు గాజుల శంకర్, సతారపు నారాయణ, దుర్గం శివకుమార్ లు పాల్గొన్నారు.