calender_icon.png 22 April, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికింద్రాబాద్ కోర్టులో ఫూలే జయంతి

12-04-2025 12:21:31 AM

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతిని శుక్రవారం సికింద్రాబాద్ కోర్టులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ లాయర్స్ జేఏసీ చైర్మన్ తలకొక్కుల రాజు మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయుడు జ్యోతిబాపూ లే అని కొనియాడారు.

సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుర్రం రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. జ్యోతిబా ఫూలే తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి మహి ళా విద్యకు కృషి చేశారని, వారి జీవిత చరిత్రను భావితరాలకు తెలియచేసే బాధ్యత మనందరిపైనా ఉన్నదన్నారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జి మల్లికార్జున్ మాట్లా డుతూ.. దేశంలో కుల వ్యవస్థకు వ్యతిరేకం గా, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు జ్యోతిబాపూలే అని అన్నా రు.

బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగులపల్లి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి పూలే మార్గదర్శకంగా తీసుకొని కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో లాయర్లు చిట్టబోయిన బాల మల్లేష్ యాదవ్, నవీన్‌రెడ్డి, కొమరయ్య, బాలు నాయక్, వెంకటరమణ, వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.