calender_icon.png 15 April, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక మార్పుకోసం అహర్నిశలు పాటుపడ్డ ఫూలే దంపతులు

13-04-2025 12:00:00 AM

జాతీయ ఓబీసీ మేధావుల ఫారం అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ

హైదర్‌గూడ చౌరస్తాలో ఫూలే దంపతుల విగ్రహాలు ఆవిష్కరణ

ముషీరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి) : మహిళా సాధికారిత, బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం కోసం ఫూలే దంపతులు అహర్నిశలు పాటు పడ్డారని తెలం గాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ అన్నారు. మహా త్మా జ్యోతిరావు ఫూలే 198వ జయంతి సందర్భంగా హైదర్‌గూడ చౌరస్తాలో ఫూలే దంపతుల విగ్రహాలను నరేందర్ గౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం నరేందర్ గౌడ్ మాట్లాడుతూ సామాజిక మార్పుకోసం వారి జీవితాలనే త్యాగం చేశారని అన్నారు. విగ్రహాల దాత జాతీయ ఓబీసీ మేధావుల ఫారం అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నేత రామన్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఫూలే దంపతుల పేరిట నెక్లెస్ రోడ్ లో రెండెకరాల స్థలంలో స్మృతి వనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి అనేకమార్లు విజ్ఞప్తి చేశామని, దీనిపై సీఎం తమ ప్రసంగంలో నెక్లెస్ రోడ్‌లో స్మృతి వనం కోసం స్థల సేకరణ చెయ్యాలని ప్రభుత్వాధికారులు ఆదేశించడం హర్షణీయం అన్నా రు. ఈ కార్యక్రమంలో నవీన్ రాజు, ఎర్ర శ్రీహరి గౌడ్, సరికొండ రామకృష్ణంరాజు, బీసీ సంక్షేమ సంఘం కార్య నిర్వాహక అధ్యక్షులు శివకుమార్, గిరగాని భిక్షపతి గౌడ్, కలల్ నర్సింలు గౌడ్, ఆనంతుల ప్రసాద్ గౌడ్, రవికుమార్ యాదవ్, ఉపేందర్ కొత్త వినయ్ బాబు, అక్షిత్ జైస్వాల్, విశ్వపతి తదితరులు పాల్గొన్నారు.