12-04-2025 01:20:07 AM
మాజీ చీఫ్ విప్, బీఆర్‌ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్
హనుమకొండ, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన మహనీయుడు ఫూలే, మహిళా విద్య కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప అభ్యుదయవాది ఫూలే, 60 ఏండ్ల తెలంగాణ కలను నిజం చేసిన మహనీయుడు కేసీఆర్ ఒక్కడిగా పోరు ప్రారంభించి, తెలంగాణ ను సాధించిన ధీరుడు కేసీఆర్ అన్నారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే పొడితెల సతీష్ బాబు మాట్లాడుతూ ఈ నెల 27 న హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రంలో సభను నిర్వహించనున్నాం. రైతులు స్వచ్ఛందంగా సభ నిర్వహణ కోసం భూములు ఇచ్చారు.
వారికి ధన్యవాదములు మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు, మా ప్రజా ప్రతినిధులు అందరం కలిసి కట్టుగా సభ ఏర్పాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. సభకు తరలి వచ్చే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సభను విజయవంతం చేసేందుకు సన్నాక సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. బీ ఆర్ ఎస్ పార్టీ శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున భారత ప్రభుత్వo ఫూలే దంపతులకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. వరంగల్ లో జరిగిన సింహ గర్జన సభను చూసిన మాజీ ప్రధాని దేవేగౌడ ఆ మీటింగ్ చూసిన అనంతరం మాట్లాడుతూ నేను చాలా సభలు చూశాను కానీ ఇలాంటి సభను ఎప్పుడూ చూడలేదు అన్నారు.
తెలంగాణ గడ్డ చైతన్యాల గడ్డ, కాంగ్రెస్ పాలనలో తెలంగాణ మళ్ళీ దగా పడుతోంది. కాంగ్రెస్ పాలన అంటేనే స్కాంలు ఫుల్లు,స్కీంలు నిల్లు, మాట తప్పడం, మడిమ తిప్పడం, కాంగ్రెస్ అంటేనే మోసం.16 నెలల్లోనే కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోతున్నారనారు. బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. గోపాల పురం ప్రాంతంలో పార్కింగ్ స్థలం వద్ద ఉన్న మొగిలి అనే రైతు తన పంట పూర్తి కాకున్నా మా కోసం తన 20 గుంటల భూమిని ఇచ్చి సాపు చేసుకోండి అన్నారు.
మరి పరిహారం కావాలా అని అడిగితే కేసీఆర్ సభ కు పైసలు అడుగుతామా అన్నాడు. పెద్ది సుదర్శన్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు చాలా కష్టపడుతున్నారు. పార్టీ నేతలు సభ ను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇటు రైతులు, అటు పార్టీ శ్రేణులు సభ కోసం సిద్ధంగా ఉన్నారు. వేలాది వాహనాల్లో, లక్షలాది మంది సభకు తరలి వస్తారు.ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా మా పార్టీ నేతలు విశేష కృషి చేస్తున్నారు. సభ కు వచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు,ఎందుకంటే కాంగ్రెస్ పై వ్యతిరేకత అందుకే నిలదీతలు ఎదురవుతున్నాయి. ప్రజల కోసమే మేము సంవత్సర కాలం ఆగాము, కానీ నేడు ప్రజలే మమ్మల్ని కోరుకుంటున్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపునేని నరేందర్, వొడితల సతీష్ బాబు, మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, వాసుదేవ రెడ్డి, నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, సాంబారి సమ్మారావ్, సదానందం, యాదగిరి, జనార్దన్ గౌడ్, పులి రజినీకాంత్, ఎల్లావుల లలితా యాదవ్ పాల్గొన్నారు.