calender_icon.png 20 March, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠకుల దృష్టిని ఆకర్షించేది ఫొటోలే

18-03-2025 12:39:09 AM

  • తెలంగాణ, త్రిపుర రాష్ట్రాలకు ఫొటోగ్రఫీలో గొప్ప చరిత్ర

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

ముషీరాబాద్, మార్చి 17: (విజయక్రాం తి): ఫొటోగ్రఫీలో తెలంగాణ, త్రిపుర రాష్ట్రాలకు గొప్ప చరిత్ర ఉందని, ఆ రోజుల్లో దేశం లో ప్రప్రథమంగా ఫోటో కెమెరాలు కొనుగోలు చేసి ఫోటోగ్రఫీని అభివృద్ధి పరిచిన ఘనత హైదరాబాద్, త్రిపుర సంస్థానాలకే దక్కిందని తెలంగాణ  గవర్నర్ జిష్ణు దేవ్ వ ర్మ అన్నారు.

ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ స్టేట్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన ఉత్తమ ఫొటో జర్నలిస్టులకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజర య్యారు.

ఈ సందర్బంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా ఉత్తమ వార్త, తెలంగాణ పండుగలు, సాంస్కృతిక విభాగాల్లో తెలంగాణ స్టేట్ ఫొటో జర్నలిస్ట్స్ అసో సియేషన్  నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త ఫొటోగ్రఫీ పోటీలలో విజేతలైన ఉత్తమ ఫోటో జర్నలిస్టులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అవార్డులను అందజేశారు.

అనంతరం గవర్నర్  ప్రసంగిస్తూ వెయ్యి మాటల కన్నా ఒక్క ఫో టో ఎంతో గొప్పదన్నారు. పత్రికల్లో ఎన్నో వార్తలు ప్రచురితమైనా పాఠకుల దృష్టిని ఆకర్షించేది ఫోటోలు మాత్రమేనని జిష్ణు దేవ్ వర్మ స్పష్టం చేశారు. చరిత్రలో రికార్డుగా ఉండి పోయేది ఫోటోలే అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావంతో పత్రికలకు ఆదరణ తగ్గి పోతుందని చర్చ జరుగుతుందని, కానీ ఇది తాత్కాలికం మాత్రమేనని, భవిష్యత్తు పత్రికలకే ఉంటుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, అఖిల భారత రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, టీయూడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె. రాంనారా యణ,  తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి గంగాధర్, కె.ఎన్.హరి పాల్గొన్నారు.