ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి లోబర్చుకున్న కామాంధుడు
పెళ్లి కుదిరించారని పెళ్లి వారికి సైతం బెదిరింపు కాల్స్
ఫోక్సో అత్యాచారం కేసులు నమోదు
నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): పెళ్లి ఫోటోలు ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే ఫోటోగ్రాఫర్ మైనర్ బాలిక పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఓ 16 ఏళ్ల బాలిక ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి తీర పెళ్లి నిశ్చయమైందని తెలిసి పెళ్లి వారిని సైతం కామాంధుడు బెదిరింపులకు గురి చేశాడు. దీంతో నాగర్ కర్నూల్ షీ టీం పోలీసులు బాలికను చేరదీసి కామాంధుడిపై ఫోక్సో అత్యాచారం కేసులను నమోదు చేశారు. షీ టీం ఇన్చార్జ్ విజయలక్ష్మి(She Team Incharge Vijayalakshmi) తెలిపిన వివరాల ప్రకారం... నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామానికి చెందిన సంబ మహేష్(25) ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తూ వివాహ కార్యక్రమాల్లో ఫోటో ఈవెంట్లు చేస్తున్నాడు. గ్రామంలోని ఫోటో స్టూడియో కూడా ఏర్పాటు చేసుకోగా ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక రహస్య ఫోటోలను చూపించి బ్లాక్ మెయిల్ చేసి లోబర్చుకున్నాడు.
ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి పలుమార్లు బలవంతంగా అత్యాచారం చేయడంతో పెద్ద మనుషులు గ్రామస్తులకు విషయం తెలిసి గ్రామంలోనే పంచాయతీ పెట్టి సెటిల్మెంట్ చేశారు. అయినా వినకుండా అదేపనిగా బ్లాక్మెయిల్ చేస్తూ ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం చేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు పెద్దల దృష్టికి తీసుకుకెల్లారు. రాజకీయ పలుకుబడితో బెదిరింపులు రావడంతో ఎలాగైనా తమ కూతురిని కాపాడుకోవాలని పెళ్లి నిశ్చయించారు. అప్పటికి ఆగకుండా పెళ్లి వారికి సైతం బెదిరింపులకు దిగడంతో విషయం పోలీసులకు చేరింది. దీంతో షీ టీం ఇన్చార్జ్ విజయలక్ష్మి వెంకటయ్యలు గ్రామంలో విచారణ జరిపి బాలికను చేరదీశారు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ రఘునాథ్ ఏఎస్పి రామేశ్వర్ ఆదేశాల మేరకు కామాంధుడిపై ఫోక్సో, అత్యాచారం కేసులను నమోదు చేసినట్లు తెలిపారు.