calender_icon.png 29 March, 2025 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెపోటుతో మృతిచెందిన ఫొటోగ్రాఫర్

26-03-2025 02:00:51 AM

 రూ.20 వేల సాయం చేసిన అసోసియేషన్

జనగామ, మార్చి 25(విజయక్రాంతి): గుండెపోటుతో మృతిచెందిన ఫొటోగ్రాఫర్ కుటుంబానికి జనగామ జిల్లా ఫొటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ రూ.20 వేల ఆర్థిక సాయం చేసింది. జనగామ పట్టణానికి చెందిన బంగారుగళ్ల రమేశ్ అనే ఫొటోగ్రాఫర్ మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయారు. అసోసియేషన్ నాయకులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబానికి రాష్ట్ర కమిటీ తరఫున రూ.10 వేలు, జిల్లా కమిటీ తరఫున 10 వేలు.. మొత్తంగా రూ.20 వేలు అందించారు. సీనియర్ ఫొటోగ్రాఫర్ వాడ్నిల లింగమూర్తి, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వలబోజు శ్రీనివాస్ , జిల్లా గౌరవ అధ్యక్షుడు కాముని రాము, ఉడుగుల  కృష్ణ, గణపురం ఉమేష్, ఎక్కల దేవి ఓంకార్ , కుందారం సాయి, శ్రవణ్ కుమార్,  దశరథ్, శేఖర్, చందు, అనిల్ ఉన్నారు.