calender_icon.png 15 November, 2024 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్యాగ‌ధ‌నుల స్పూర్తి చాటి చెప్పేలా ఫోటో ఎగ్జిబిష‌న్‌

15-08-2024 07:29:07 PM

కేంద్ర స‌మాచార శాఖ ఫోటో ఎగ్జిబిష‌న్‌ను ప్రారంభించిన క‌లెక్ట‌ర్ పి.ప్రావీణ్య‌

అరుదైన చిత్రాల‌ను వీక్షించాల‌ని సూచ‌న‌, నిర్వాహ‌కుల‌కు అభినంద‌న‌లు

ప‌లు పోటీల‌ విజేత‌ల‌కు బ‌హుమ‌తుల ప్ర‌దానం

హ‌న్మ‌కొండ‌: కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖ యొక్క సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ క‌మ్యూనికేష‌న్స్ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిష‌న్‌ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల పోరాట స్ఫూర్తిని చాటిచెప్పేలా ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ పి.ప్రావీణ్య ప్ర‌శంసించారు. భార‌త ప్ర‌భుత్వ స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖ యొక్క సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ క‌మ్యూనికేష‌న్స్ ఫీల్డ్ ప‌బ్లిసిటీ అధికారి శ్రీ‌ధ‌ర్ సూరునేని కిష‌న్ పురాలోని గీతాంజలి డిగ్రీ క‌ళాశాల‌లో ఏర్పాటు చేసిన రెండు రోజుల ఫోటో ఎగ్జిబిష‌న్‌ను జిల్లా క‌లెక్ట‌ర్ పి.ప్రావీణ్య గురువారం ప్రారంభించారు. అనంత‌రం తెలుగు స్వాత్రంత్య స‌మ‌ర‌యోధుల అరుదైన చిత్రాల‌ను వీక్షించారు.

అనంత‌రం ఏర్పాటు చేసిన స‌మావేశంలో క‌లెక్ట‌ర్ పి.ప్రావీణ్య పాల్గొన్నారు. ఫీల్డ్ ప‌బ్లిసిటీ అధికారి శ్రీ‌ధ‌ర్ ఆధ్వ‌ర్యంలోని నిర్వ‌హించిన వాల్ పేయింటింగ్‌, వ్యాస‌ ర‌చ‌న పోటీల‌తో పాటుగా గ్రూప్ డ్యాన్స్‌, సోలో డ్యాన్స్ స‌హా ఇత‌ర పోటీల విజేత‌ల‌కు బ‌హుమ‌తులు, స‌ర్టిఫికేట్ల ప్ర‌ధానం చేశారు. ఈ సంద‌ర్భంగా కార్య‌క్ర‌మ నిర్వాహ‌కులైన ఫీల్డ్ ప‌బ్లిసిటీ అధికారి శ్రీ‌ధ‌ర్ ఫోటో ఎగ్జిబిషన్ గురించి వివ‌రిస్తూ, దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు ప‌ణంగా పెట్టి పోరాడిన తెలుగు మ‌హ‌నీయుల గురించి నేటి త‌రానికి వివ‌రించేందుకు ఈ ఫోటో ఎగ్జిబిష‌న్ ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. పోరాట యోధుల పంథాలో విద్యార్థులు త‌మలో నూత‌న స్ఫూర్తిని ర‌గిలించుకొని ముందుకు సాగాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. హాజ‌రైన వారిని ఉద్దేశించి 

జిల్లా క‌లెక్ట‌ర్ క‌లెక్ట‌ర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ... దేశ స్వాతంత్య్ర పోరాటంలో జెండా రూప‌క‌ర్త‌ పింగ‌ళి వెంక‌య్య మొద‌లుకొని అనేక‌మంది స్వేచ్చా వాయువుల కోసం త‌మ జీవితాల‌ను ప‌ణంగా పెట్టి పోరాటం చేశార‌ని గుర్తు చేసుకున్నారు. ఆ త్యాగ‌ధ‌నుల స్ఫూర్తిని చాటిచెప్పేలా ఫొటో ఎగ్జిబిష‌న్ నిర్వ‌హిస్తున్నార‌ని ఫీల్డ్ ప‌బ్లిసిటీ అధికారి శ్రీ‌ధ‌ర్ ను ప్ర‌శంసించారు. నేడు, రేపు సైతం కొన‌సాగే ఈ ఎగ్జిబిష‌న్‌ను వీక్షించాల‌ని ఆమె సూచించారు. వివిధ పోటీలలో విజేత‌ల‌కు అభినందించారు. ఈ సంద‌ర్భంగా ఎయిర్ఫోర్స్ ఫ‌స్ట్ ఆఫీస‌ర్ టి.శ్రీ‌నివాస్‌ను కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌కులైన శ్రీ‌ధ‌ర్ సూరునేని జిల్లా కలెక్ట‌ర్ పి.ప్రావీణ్య చేతుల మీదుగా అభినందించారు.