calender_icon.png 19 November, 2024 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు అందజేత

19-11-2024 01:26:04 AM

జూబ్లీహిల్స్ పోలీసులను కలిసిన చక్రధర్‌గౌడ్

సిద్దిపేట, నవంబర్ 18(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు తన ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పపడ్డారని కాంగ్రెస్ నాయకుడు చక్రధర్‌గౌడ్ జూబ్లీహిల్స్ పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. అయితే తన వద్ద ఉన్న ఆధారాలతో సోమవారం రావాలని జూబ్లీహిల్స్ పోలీసులు కోరగా చక్రధర్‌గౌడ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన విజయక్రాంతితో మాట్లాడుతూ.. 2023 ఆగస్టు 29 న తన ఫోన్‌ను పోలీసులు అధికారికంగా ట్యాప్ చేస్తున్నట్లు మెయిల్ ఐడీకి మెసేజ్ వచ్చిందన్నారు. అప్పు టి మంత్రి హరీశ్‌రావు అక్రమాలను ప్రశ్నించినందుకే తన ఫోన్‌ను ట్యాప్ చేసినట్టు తెలిపారు. ఇదివరకే తన సోదరుడు, డ్రైవర్ల నుంచి పోలీసులు ఆధారాలు తీసుకున్నట్లు తెలిపారు.

పోలీసులు సోమవారం వీడియో రికార్డు చేస్తూ తన వద్ద నుంచి ఆధారాలను తీసుకున్నట్లు తెలిపారు. తన కు న్యాయం జరుగుతుందనే నమ్మ కం ఉందని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ సినీపరిశ్రమకు చెందిన వారి ఫోన్లు ట్యాప్ చేస్తే.. హరీశ్‌రావు రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయిం చారని చక్రధర్‌గౌడ్ ఆరోపించారు.