calender_icon.png 15 May, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాల్లో ఫోన్ మిత్ర, ప్రాజెక్టు మిత్ర సేవలు

15-04-2025 12:01:50 AM

విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు కార్యక్రమాలు

హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాం తి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల విద్యార్థులు వివిధ కారణాలతో క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్ప డుతూ తల్లితండ్రులకు శోకాన్ని మిగిల్చుతున్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని తెలం గాణ ప్రభుత్వం ఫోన్‌మిత్ర, ప్రాజెక్టు మిత్ర పేర్లతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం గౌలిదొడ్డిలోని బాలురు, బాలికల గురుకుల పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, గురుకుల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి హాజరై కార్యక్రమా న్ని ప్రారంభించారు.

గురుకుల విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 268 గురుకుల విద్యాలయాల్లోనూ ఈ సేవలు రెండ్రోజుల్లో అందుబాటులోకి రానున్నా యి. ఫోన్ మిత్ర ద్వారా విద్యార్థులు రోజుకు ఎన్నిసార్లయినా తమ తల్లిదండ్రులు, కుటుం బ సభ్యులతో ఉచితంగా మాట్లాడుకోవచ్చు.

ప్రతి నలుగురు విద్యార్థులకు కలిపి ఒక ఫోన్ కార్డు ఇస్తారు. తల్లిదండ్రులు అనుమతించిన రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్లకు మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. దీనితో పాటు ఒక సహా య కేంద్రం నంబరు కూడా అందుబాటు లో ఉంచనున్నారు. పాఠశాలల్లో సమస్యలు, భోజనం, వసతి సమస్యలు, మానసిక ఒత్తిడికి గురైనప్పుడు సాంత్వన కోసం సహాయ కేంద్రం నంబరుకు ఫోను చేసి అధికారులకు ఫిర్యాదు చేసే విధంగా అవకాశం కల్పించనున్నారు.