calender_icon.png 26 November, 2024 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ పేరుతో ఉద్యోగులకు ఫోన్‌కాల్స్

28-08-2024 12:14:49 AM

కేసులు కాకుండా చూస్తామని డబ్బులు డిమాండ్

ఫేక్ కాల్స్ నమ్మవద్దని ఏసీబీ అధికారిక ప్రకటన

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (విజయక్రాంతి): ఇటీవల రా్రష్ట్రం లో ఏసీబీ అధికారుల దూకుడుతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇదే అదునుగా భావించిన కొందరు దుండగులు.. ఏసీబీ అధికారులమంటూ ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ చేసి.. మీపై కేసులు కాకుండా చూస్తామని మాయమాటలు చెప్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

కొంతమంది దుం డగులు ఏసీబీ అధికారులమంటూ ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వారి మాటలు నమ్మి ఇప్పటికే పలువురు ఉద్యోగులు డబ్బులు చెల్లించినట్లు కూడా తెలిసింది. ఇలాంటి ఫేక్ కాల్స్‌ను ఎవరూ నమ్మవద్దని, ఏసీబీ అధికారులెవరూ ఉద్యోగులకు ఫోన్లు చేయరని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు, సాధారణ ప్రజలకు ఎవరైనా ఇలాంటి కాల్స్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని పేర్కొంది.