calender_icon.png 24 December, 2024 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దార్శనికుడు పీవీ నరసింహారావు

24-12-2024 12:00:00 AM

సీఎం రేవంత్‌రెడ్డి  

హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): మాజీ ప్రధాని దివంగత పీవీ నర సింహారావు వర్ధంతి సందర్భంగా సోమవారం  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో పీవీ చిత్రపటానికి రేవంత్‌రెడ్డి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా దే శానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పీవీ తెలంగాణ బిడ్డ, బహుభాషా కోవి దుడన్నారు. 

సరళీకృత ఆర్థిక విధానాలతో సం స్కరణలకు బీజం వేసి దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చిన దార్శనికుడని సీఎం కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.