పోలీసుల వేధింపులే కారణమని సెల్ఫీ వీడియో
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 26 (విజయక్రాంతి): నాచారంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. నాచారంలోని సరస్వతి కాలనీలో నివాసం ఉంటున్న పీహెచ్‌డీ విద్యార్థిని దీప్తి గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన నాన్న మీద నమోదైన కేసులో పోలీసులు తనను వేధిస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని మరణానికి ముందు సెల్ఫీ వీడియో రికార్డు చేసింది. దీప్తి ఆత్మహత్యకు కారణమైన పోలీసులపై చర్యలు చేప ట్టాలని కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. సమా చారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దీప్తి మృతిపై కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.