సూర్యాపేట, జనవరి 23 (విజయక్రాంతి): ఇన్వెస్టిగేటింగ్ పోలెన్ కాంపోజిషన్ ఇన్ ఎపీస్ హనీ శాంపిల్స్ ఫ్రమ్ నల్లగొండ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇండియా ‘ అనే అంశం మీద డాక్టర్ ఛాయా పర్యవేక్షణలో సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి సూర్యాపేట జిల్లా నాగారం మండలం పసునూరు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్గా విదులునిర్వహిస్తున్న బల్గూరి చంద్రబాబుకు పి పిహెచ్డి ప్రధానం చేశారు.
ఇతను నల్లగొండ జిల్లా కనగల్ మండలం రామచంద్రాపురం వాసి. ప్రాథమిక, హై స్కూల్ విద్యను చండూరులోని గీతా విద్యాలయం లో, నల్లగొండ లోని నాగార్జున డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ విద్యాభ్యాసం సాగించాడు. ఈ సందర్భంగా చంద్రబాబును మిత్రులు గుర్రాల సోమయ్య గౌడ్, డాక్టర్ గుండ గాని రాజయ్య గౌడ్, గంగపురి వీరారెడ్డి, కుందమల్ల నాగరాజు అభినందించారు.