calender_icon.png 6 February, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ కౌన్సెలింగ్ ప్రారంభం

06-02-2025 12:03:04 AM

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 5 : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో విద్యను అభ్యసించే అవ కాశం రావడం అదృష్టమని రిజిస్ట్రార్ డాక్టర్ జిఈసి హెచ్ విద్యాసాగర్ పేర్కొన్నారు. తాను కూడా బీఎస్సీ, ఎంఎస్సీ ఇక్కడే చదివినట్లు గుర్తు చేసుకున్నారు.

2024 - 25 విద్యా సంవత్సరానికి సంబంధించిన పీహెచ్డీ కౌన్సెలింగ్‌ను ఆయన బుధవారం రాజేంద్ర నగర్‌లోని వాటర్ టెక్నాలజీ సెంటర్ లోని డైమండ్ జూబ్లీ బ్లాక్ లో ప్రారంభించారు.

నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శ కంగా నిర్వహిస్తామని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత ప్రణాళికాబద్దంగా సెమిస్టర్లు పూర్తి చేస్తామని డీన్, పీజీ స్టడీస్ డాక్టర్ కేబీ ఈశ్వరి తెలి పారు. తొలుత అగ్రానమీలో సీట్లు పొందిన విజయశ్రీ కి రిజిస్ట్రార్ కేటాయింపు పత్రాన్ని అందజేశారు.