calender_icon.png 18 April, 2025 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీహెచ్‌సీ భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి

10-04-2025 02:34:08 AM

నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి

నాగార్జున సాగర్, ఏప్రిల్ 9 : నిడమనూరు పీహెచ్సీ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. నిడమనూరు మండల కేంద్రంలో నిర్మిస్తున్న పీహెచ్సీ భవనాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. ఈ నెలాఖరులోగా భవన నిర్మాణం పూర్తిచేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. అంతకుముందు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ  చేసి ఓపీ, ఇన్ పేషెంట్, ఏఎన్సీ రిజిస్టర్లు, హైరిస్క్ చార్టును తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.

మిర్యాలగూడ ఏరియా దవాఖాన నిడమనూరుకు 25 కిలోమీటర్లు ఉండడంతో అన్ని వైద్య సేవలను అందించాలని, ప్రసవాల సంఖ్యను పెంచాలని వైద్యులకు సూచించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రేషన్ కార్డు దరఖాస్తులు, ధరణి దరఖాస్తులపై ఆరా తీశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రైతులకు ఇబ్బంది లేకుండా అన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించడమే కాకుండా కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలన్నారు.  అనంతరం చిట్యాల మండలం వెలిమినేడు, పెదకాపర్తి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

వెలిమినేడులో రూ. 22 లక్షలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని స్థానిక. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ప్రారంభించారు.  అంతకుముందు జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో పోషణపక్షం- 2025పై మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులతో  కలెక్టర్ నిర్వహించారు.