29-03-2025 04:40:24 PM
CITU జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డా రవికుమార్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లోని కేటీపీఎస్ 6వ దశ నిర్మాణంలో పనిచేసిన కార్మికులను ఆర్టిజెన్లు గా తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డ రవికుమార్ డిమాండ్ శనివారం నిర్మాణ కార్మికులు చేపట్టిన నిరశన శిబిరం సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... 6వ దశ నిర్మాణంలో తమ ప్రాణాలు పణంగా పెట్టి పునాది దగ్గర నుండి ఉత్పత్తి జరిగే వరకు పనిచేసిన కార్మికులను నిర్దాక్షిన్యంగా బయటకు వెల్లగొట్టారని ఆరోపించారు. ఆ సందర్బంగా CITU మిగతా కార్మికసంఘాలతో కలిసి ఆందోళన చేపట్టిన సందర్భంలో 7వ దశలో మేయింటెనెన్సు CLగా తీసుకొంటామని హామీ ఇచ్చారు.
ఇచ్చిన హామీని అమలుచేయకుండా గ్రామసభలు ద్వారా నిర్మాణం తో సంబంధం లేనివారిని తీసుకొని వారికి ఆర్టిజన్లుగా అవకాశం కల్పించారాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా KTPS యాజమాన్యం, ప్రభుత్వం స్పందించి నిర్మాణ కార్మికులుగా పనిచేసి ఉపాది లేక ఇబ్బందులు పడే 418 మందిని బేషరతుగా ఆర్టిజన్లు గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా జరగని పక్షంలో బాధిత కుటుంబాల, కుటుంబ సభ్యులతో సహా KTPS ను దిగ్బంధిస్తారని ఆయన హెచ్చరించారు ఈ పోరాటంలో CITU ముందుండి వారికి సహాయ సహాకారాలు అందిస్తుందని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో CITU పాల్వంచ కార్యదర్శి కాతోజు సత్య, GENCO UEEU అధ్యక్షులు అంకిరెడ్డి నరసింహ రావు, నిర్మాణ కార్మికుల నాయకుడు హాథిరామ్ పాల్గొన్నారు.