calender_icon.png 5 March, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫార్మాసిటీని రద్దు చేయాల్సిందే

05-03-2025 12:38:42 AM

యాచారం  మార్చి 4 : ఫార్మాసిటీ రద్దు చేయాల్సిందేనని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి  జాన్ వెస్లీ  అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా,యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ కి సంబంధించిన భూములను బాధితులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ.

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఫార్మాసిటీ రద్దు చేసి బలవంతంగా రైతుల వద్ద తీసుకున్న భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2200 ఎకరాల పట్టా భూమిని టీఎస్ ఐఐసీ పేరును తొలగించి  రైతుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య , రైతు సంఘం జిల్లా నాయకుడు మధుసూదన్ రెడ్డి , మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి.అంజయ్య , సిఐటియు జిల్లా కార్యదర్శి  బ్రహ్మయ్య ,మాజీ సర్పంచ్  పెద్దయ్య, మాజీ ఉపసర్పంచ్ కావాలి జగన్, మాజీ ఎంపిటిసి తావు నాయక్ , నాలుగు గ్రాముల సంబంధించిన రైతులు పాల్గొన్నారు.